రోజూ తినే ఆహారంతోనే కరోనా నుంచి రక్షించుకోవచ్చు..!
By సుభాష్ Published on 16 July 2020 12:38 PM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి గుజగజ వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ లేని కారణంగా రోజురోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ వైరస్ నుంచి రక్షించుకునేందుకు రోగనిరోధక శక్తి పెంచుకోవడమే మార్గం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా వ్యాపిస్తుంది. ఇతర మందులకు పెట్టే ఖర్చు తినే ఆహారానికి పెడితే ఎంతో మేలంటున్నారు వైద్య నిపుణులు. మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలతోనే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం.
వెల్లుల్లి :
రెగ్యూలర్‌గా కూరల్లో వాడే వెల్లుల్లితో బోలెడు లాభాలున్నాయి. వెల్లుల్లిలో అనేక యాంటీ ఆక్సిండెంట్లు కలిగి ఉంటాయి. జీర్ణాశయంలో ఏర్పడే పుండ్లు, క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పుచ్చకాయ:
దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. పుచ్చకాయలో గ్లూటాథియోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచి ఇన్‌పెక్షన్లు, జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.
క్యాబేజీ:
దీనిని సలాడ్ రూపంలో తీసుకుంటే ఎంతో మంచిది. ఇది ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా రక్తవృద్ధికి ఎంతో తోడ్పడుతుంది.
పొటాటో :
చిలకడదుంప.. దీనిలో కెరొటిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాల నుంచి ఎదురయ్యే సమస్యలను తొలగివస్తాయి. అన్నింటికంటే వృద్ధాప్య ఛాయలను తగ్గించే విటమిన్-ఏ పుష్కలంగా ఉంటుంది.
పెరుగు :
వర్షాకాలం.. చలి కాలంలో పెరుగును కొందరు తక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే జలుబు చేస్తుందేమోనని. రోజూ ఒక ఎప్పు పెరుగు తింటే తరచూ జలుబు బారిన పడే అవకాశం తగ్గుతుంది. జబ్బులతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. ఇందులో విటమిన్ - డి అధికంగా ఉంటుంది. ప్లూ వంటి సమస్యలను నివారిస్తుంది.
పాలకూర :
పాలకూరలో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం సమృద్ధిగా లభించడమే కాకుండా విటమిన్-సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇది శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి ఎంతో తోడ్పడుతుంది.
బాధం :
ఇది వ్యాధి నిరోధక శక్తిని తగ్గకుండా ఉపయోగపడుతుంది. బాదంలో బి-విటమిన్లు ఒత్తిడి, ఆందోళన వంటి ప్రభావాల నుంచి బయటపడడానికి తోడ్పడతాయి. బాదంలో విటమిన్ -సి అధిక సంఖ్యలో లభిస్తుంది.
ఇక ఇవే కాకుండా రోగనిరోధక శక్తి పెంచేందుకు ఎన్నో ఫలాలున్నాయి. సిట్రస్ జాతి పండ్లు నిమ్మకాయ, ఆరెంజ్, క్యారెట్, పుట్ట గొడుగులు, పసుపు, ఉల్లి, వంటివి మన శరీరంలో నిరో నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే కమలాలు, ద్రాక్షల్లో ఉండే విటమిన్ సి రక్తంలోని యాంటీబాడీస్‌ను, తెల్ల రక్తకణాలను వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కమలాలు, ద్రాక్షలతో పాటు కివీ పళ్లు, స్ట్రాబెర్రీలు, బెంగళూరు క్యాబేజీ, మరియాలు, ఉడికించిన క్యాబేజీ, గోబీ పువ్వుల్లో సి విటమిన్ లభిస్తుంది. ఇక శోంఠి, మిరియాలు, గుడ్ల వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వైరస్‌లను అడ్డుకుంటాయి.