కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులకు వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా త్రివిధ దళాలు దిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కోవిడ్ ఆస్పత్రులపై ఆదివారం హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించాయి.