విశాఖ ఘటనపై హైపర్‌ కమిటీ ఏర్పాటు

By సుభాష్  Published on  8 May 2020 9:12 AM GMT
విశాఖ ఘటనపై హైపర్‌ కమిటీ ఏర్పాటు

ఏపీలోని విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ లో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైపర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు హైపర్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హైపర్‌ కమిటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా నియమించారు. అలాగే కమిటీలో సభ్యులుగా పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కరికలవలవన్‌, వైజాక్‌ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కె మీనా. పీసీబీ మెంబర్‌ సెక్రటరీ వివేక్‌లు సభ్యులుగా నియమించారు.

ఘటనపై సమగ్రంగా దర్యాప్తు

ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన పరిశ్రరమలో జరిగిన గ్యాస్‌ లీకేజీ కావడానికి గల కారణాలపై ఈ కమిటీ పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తుంది. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ చేపట్టిన విస్తరణ కార్యకలాపాలు, దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇక విచారణలో చేపట్టిన అంశాలు, పాలిమర్స్‌ యాజమాన్యం వెల్లడించిన అంశాలతో కూడిన సమగ్రర నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుందని హైపరర్‌ కమిటీకి సూచించినట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.

Next Story
Share it