హైపర్ ఆది చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న దొరబాబు.. ఎందుకో తెలిస్తే..!
By సుభాష్ Published on 22 May 2020 3:39 PM ISTఇటీవల సెక్స్ రాకెట్‌లో జబర్దస్త్ కమెడియన్ దొరబాబు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పట్లో హైపర్ ఆది టీమ్ కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే ఈ ఘటనలో దొరబాబు కెరీర్ కష్టాల్లో పడిపోయిందని అంతా భావించారు. ఇక హైపర్ ఆది టీమ్‌కు మల్లెమాల ప్రొడక్షన్ కూడా హెచ్చరికలు జారీ చేసి వదిలేసింది. తర్వాత ఓ ఎపిసోడ్స్‌లో దొరబాబు ప్రత్యక్షమయ్యాడు. తాజాగా లాక్‌డౌన్ కారణంగా జబర్దస్త్ షో షూటింగ్ నిలిచిపోయింది. ఆది స్కిట్‌లో ప్రధానంగా కనిపించే దొరబాబు, రైజింగ్ రాజులకు ఆర్థిక ఇబ్బందలు తలెత్తినట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
అయితే వీరి పరిస్థితిని గమనించిన హైపర్ ఆది తన టీమ్ సభ్యులకు అందరికి సహాయం చేసినట్లు సమాచారం. అంతేకాదు దొరబాబు గతంలో చేసిన పనుల వల్ల ఆదికి పెద్ద తలనొప్పి వచ్చినప్పటికీ, అవేమి మనసులో పెట్టుకోకుండా హైపర్ ఆది సాయం చేసినట్లు తెలుస్తోంది. పాడుపనిలో దొరబాబు అడ్డంగా దొరికిపోయినా.. ఆది సాయం చేయడాన్ని దొరబాబు కన్నీళ్లు పెట్టుకున్నాడట. దొరబాబు లాంటి ఆర్టిస్టులకు లైఫ్ ఇవ్వడమే కాకుండా అతడు అతడు తప్పు చేసినా క్షమించి వదిలేసి కష్టాల్లో ఉన్నాడని హైపర్ ఆది ఆదుకోవడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.