హైదరాబాద్‌ :బాచుపల్లి పీఎస్‌ పరిధిలోని నిజాంపేట్ పుష్పక్ గృహ సముదాయం దగ్గర నాలాలో పడి భవన కార్మికుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని రకీబుల్ షేక్‌(36)గా గుర్తించారు. నిజాంపేట్‌లోని పుష్పక్‌ అపార్ట్‌మెంట్ దగ్గర రకీబుల్ షేక్ నివాసముంటున్నాడు.

వర్షం వస్తున్న సమయంలో రకీబుల్ షేక్ బయటకు వచ్చాడు. కారు వస్తుందని పక్కకు జరిగాడు. అలా పక్కకు జరగ్గానే కాలు జారి పక్కనే నాలాలో పడి రకీబుల్ షేక్ కొట్టుకుపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి కాపాడదామని ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. రకీబుల్ షేక్ స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన రకీబుల్ షేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.