108లో ప్రసవం..తల్లీబిడ్డ క్షేమం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 7:17 AM GMT
108లో ప్రసవం..తల్లీబిడ్డ క్షేమం

హైదరాబాద్‌ : మలక్‌ పేట్‌లోని నల్లగొండ చౌరస్తాలో 108 అంబులెన్స్‌లోనే ఓ మహిళ ప్రసవించింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రవి, గిర అనే దంపతులు బుడంగ్‌ పేటలో నివాసముంటున్నారు. పురిటి నొప్పులు రావడంతో ఓలా క్యాబ్‌లో ఆస్పత్రికి బయల్దేరారు. ఈ లోపు 108 వాహనానికి కూడా సమాచారం ఇచ్చారు. సంతోష్ నగర్ చౌరస్తాలో 108వాహనంలోకి మారారు. పేట్ల బురుజు ఆస్పత్రికి తరలిస్తుండగా నల్లగొండ చౌరస్తాలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్‌ సిబ్బంది తల్లీ, బిడ్డను కోటి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు క్షేమంగానే ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

Next Story
Share it