హైదరాబాద్: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడి పడి మౌనిక అనే యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిన్నటి నుండి రాష్ట్ర ప్రభుత్వం గాని, మెట్రో అధికారులు కానీ  స్పందించలేదు. అయితే..తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ మౌనిక కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇష్టపడి మెట్రో ప్రయాణం చేస్తున్న తరుణంలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమన్నినారు. అసలు మెట్రో ప్రయాణం సురక్షితమా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మెట్రో ప్రాజెక్ట్ ను ఇన్స్పెక్షన్ చేయాలని ఆయన కోరారు. అలాగే మౌనిక కుటుంబానికి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని, మెట్రో అధికారులను  డిమాండ్ చేసారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.