హైదరాబాదీ 'హైస్టార్‌' యాప్‌.. 15 సెకన్లు కాదు.. 1 నిమిషం వీడియోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2020 6:43 AM GMT
హైదరాబాదీ హైస్టార్‌ యాప్‌.. 15 సెకన్లు కాదు.. 1 నిమిషం వీడియోలు

టిక్ టాక్.. ఎంతో మందికి ఆనందాన్ని నింపింది. మరెంతో మందికి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మరెందరో జీవితాల్లో బాధను కూడా నింపింది. ఒకప్పుడు భారత్ లో ఎంతో మంది ఈ యాప్ ను తమ ఫోన్ లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. చైనా ప్రొడక్ట్స్ ను బ్యాన్ చేయాలి అన్నప్పుడు చాలా మంది టిక్ టాక్ ను అన్ ఇన్స్టాల్ చేసేశారు. ఇటీవలే భారత్ చైనా యాప్స్ ను చాలా వరకూ బ్యాన్ చేసేసింది. వాటిలో టిక్ టాక్ కూడా ఉంది.

ఇక టిక్ టాక్ కు ఉన్న క్రేజ్, మార్కెట్ ను క్యాష్ చేసుకోడానికి ఎన్నో యాప్స్ పోటీ పడుతూ ఉన్నాయి. షార్ట్ వీడియో ఫార్మాట్ లో భారతీయులను ఆకట్టుకోడానికి ఈ యాప్స్ చాలా ప్రయత్నాలే చేస్తున్నాయి. స్నాక్ వీడియో, లైకీ లైట్, జిల్లి యాప్స్, రొపోసో, చింగారీ వంటి యాప్‌లు వచ్చినా.. టిక్‌టాక్‌ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

5 సెకన్లు కాదు.. 1 నిమిషం వీడియోలు

ఇక టెక్నాలజీ హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్‌ అయితే.. టిక్‌టాక్‌ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. పబ్బాస్‌ గ్రూప్‌ అనే కంపెనీ హైస్టార్‌ అనే ఓ యాప్‌ను విడుదల చేసింది. చాలా యాప్‌లలో 15 సెకన్ల నిడివి మాత్రమే ఉండగా.. హైస్టార్‌ యాప్‌లో నిమిషం వరకు వీడియోలు చేసుకోవచ్చు. హైస్టార్‌ యాప్‌ సీఈఓ స్వామి ముద్దం మాట్లాడుతూ.. డైలాగ్స్‌, కామెడీ, గేమింగ్‌, పుడ్‌, స్పోర్ట్స్‌, మీమ్స్‌ ఇలా విభిన్న అంశాల్లో వీడియోలు చేసి ప్రదర్శించుకోవచ్చునని తెలిపారు. అంతేకాకుండా.. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన వారికి పలు కంపెనీల ప్రకటనల్లో నటించే అవకాశం సైతం కల్పిస్తున్నామని.. తద్వారా పేరు ప్రతిష్టలతో పాటు సంపాదన ఉంటుందని పేర్కొన్నారు.

Next Story