హైదరాబాద్ మహిళా ప్రయాణికులకు TSRTC మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ మరో శుభవార్త వినిపించింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 2:09 AM GMTహైదరాబాద్ మహిళా ప్రయాణికులకు TSRTC మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ మరో శుభవార్త వినిపించింది. ఇప్పటికే ఆర్టీసీ ప్రయాణికులను తమ వైపు ఆకర్షించుకునేలా ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు, కొత్తకొత్త సేవలను అందుబాటులోకి తెస్లుంది. ప్రయాణికుల ఆదరణ ఉన్నచోట్ల మరిన్ని సేవలను పునరుద్ధరిస్తోంది. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్‌లో మహిళా ప్రయాణికుల కోసం లేడీస్ స్పెషల్ బస్సులను ప్రారంభించింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. కాగా.. ఇప్పుడు మరోకొత్త మార్గంలోనూ లేడీస్ స్పెషల్ బస్సును నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈసారి కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ రూట్‌లో 127k నెంబర్‌తో బస్సు సర్వీసు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే నెంబర్ బస్సును లేడీస్ స్పెషల్ అంటూ మహిళలకోసం సేవలను ప్రారంభించనుంది. ఈ నెల 21 నుంచి మహిళల స్పెషల్ బస్సు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది ఆర్టీసీ సంస్థ. ప్రతిరోజు ఉదయం 8:50 గంటలకు కోఠి నుంచి ఈ లేడీస్ స్పెషల్ బయల్దేరి.. లక్డీకాపుల్, మాసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్‌రోడ్ మీదుగా కొండాపూర్ చేరుకుంటుంది. మళ్లీ తిరిగి సాయంత్రం 5:45 గంటలకు లేడీస్ స్పెషల్ బస్సు కొండాపూర్ నుంచి ఇదే మార్గంలో కోఠికి చేరుకుంటుంది. అయితే.. మహిళా ప్రయాణికులు ఈ రూట్‌లో వెళ్లేవారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు ట్విట్ చేశారు.
కాగా.. అంతకు ముందు ఐటీ కారిడార్‌లో పనిచేస్తోన్న మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ బస్సును టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ స్పెషల్ బస్సు జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ మార్గంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయాల్లో అందుబాటులో ఉంది. కాగా.. ఈ సర్వీస్‌ను ప్రారంభించిన సమయంలోనే మరిన్ని లేడీస్ స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెస్తామని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. తాజాగా కోఠి-కొండాపూర్ మార్గంలో మరో లేడీస్ స్పెషల్ బస్సును ప్రారంభించింది.
మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023