క్రిప్టో కరెన్సీ వ్యాపారం.. అధిక లాభాలు వస్తాయంటూ భారీ మోసాలు

Three persons arrested scams in the name of cryptocurrency.క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లక్షలు

By M.S.R  Published on  6 Nov 2021 7:16 AM GMT
క్రిప్టో కరెన్సీ వ్యాపారం.. అధిక లాభాలు వస్తాయంటూ భారీ మోసాలు

క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లక్షలు, కోట్లు వస్తాయంటూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నూరలం హక్ (23), ఎక్రమ్ హుస్సేన్ (23), మహ్మద్ ఇజారౌల్ (24) ఉన్నారు. మరో నిందితుడు ఛోటాభాయ్ పరారీలో ఉన్నాడు. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన పోలీసులు రూ. 50 లక్షలు డిపాజిట్లు ఉన్నాయని గుర్తించారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, పాస్ బుక్కులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛోటా భాయ్ అలియాస్ దీపు మోండల్, ముఠా సభ్యుల ద్వారా బాధితులను సంప్రదించి, క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టమని వారికి అధిక లాభాలు ఇస్తామని హామీ ఇచ్చాడు. ఛోటా భాయ్, నూరాలమ్ హక్‌లు మరో ఇద్దరితో కలిసి వివిధ బ్యాంకుల్లో 64 బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ ముఠా బిజియం టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, కార్గో సొల్యూషన్స్, కర్వ్డ్ హెయిర్ ప్రొడక్షన్స్, హర్చరణ్ ఎంటర్‌ప్రైజెస్, క్వికో ఎం ఇన్ఫర్మేషన్ టెక్, స్కై డెస్టినేషన్ ట్రావెల్, ఇంట్రా ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్, ఫానిగో కన్సల్టెన్సీ పిఆర్‌ఐ, మహాదేవి ఎంటర్‌ప్రైజ్, ఫతేహ్ టెక్స్‌టైల్స్, విండ్‌ఫుల్ టెక్స్‌టైల్స్ వంటి అనేక నకిలీ కంపెనీలను సృష్టించింది.

సెప్టెంబర్‌లో ఈ ముఠా ఘట్‌కేసర్‌కు చెందిన భానోతు కిరణ్‌కుమార్‌ను సంప్రదించి రూ.50,000 తొలి పెట్టుబడి పెడతానని ఎర చూపింది. పెట్టుబడిపై 10,000 రూపాయలు లాభం చూపించిన నిందితులు.. ఆపై రూ.86 లక్షల పెట్టుబడి పెట్టించి మోసం చేశారని.. రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story