నక్లెస్ రోడ్‌లో సందడి చేయనున్న సినీ తారలు

ప్రజా విజయోత్సవాలలో భాగంగా నక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను నేడు సాయంత్రం ప్రముఖ సినీ తారలు సందర్శించి సందడి చేయనున్నారు.

By Kalasani Durgapraveen  Published on  8 Dec 2024 9:39 AM GMT
నక్లెస్ రోడ్‌లో సందడి చేయనున్న సినీ తారలు

ప్రజా విజయోత్సవాలలో భాగంగా నక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను నేడు సాయంత్రం ప్రముఖ సినీ తారలు సందర్శించి సందడి చేయనున్నారు. లక్కీ భాస్క ర్ సినిమా తోపాటు పలు హిట్ సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాల్లో నటించిన అంజలి లతో పాటు మరికొందరు సినీ నటులు నేడు సాయంత్రం 6 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన హాండీ క్రాఫ్ట్స్, ఫుడ్ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం ఐమాక్స్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ క‌న్స్‌ర్ట్‌కు కూడా హాజరవుతారు.

7 గంటలకు రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ షో..

హెచ్ఎండీఏ ఐమాక్స్ గ్రౌండ్ లో నేడు సాయంత్రం 7 గంటలకు ప్రముఖ గాయకుడు, లిరిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ సింప్లి గంజ్ ఆయన బృందంచే అద్భుతమైన మ్యూజికల్ కన్సర్ట్ జరుగనుంది. ప్రజా విజయోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా శని వారం నాడు ఏర్పాటు చేసిన వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ నైట్ కు నగరవాసులనుండి అద్భుత మైన ఆదరణ లభించింది. దీనిలో భాగంగా, నేడు ఏర్పాటు చేసిన రాహుల్ సిప్లిగంజ్ సంగీత విభావరి కి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. ఆదివారం సెలవు కావడం నేడు సాయంత్రం 4 వైమానిక విన్యాసాలను( ఎయిర్ షో ) వీక్షించడానికి భారీ సంఖ్యలో నగర వాసులే కాకుండా ఇతర ప్రాంతాలనుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీరందరూ కూడా రాహుల్ సిప్లిగంజ్ షో కు హాజరవుతారని, ఇందుకు తగ్గట్టుగా అధికారులు తగు ఏర్పాట్లను చేశారు

Next Story