Hyderabad: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

By Srikanth Gundamalla  Published on  22 Jun 2024 11:30 AM IST
student leaders, protest,  union minister kishan reddy, house,

Hyderabad: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నీట్‌ పరీక్షను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ కాచిగూడలో ఉన్న ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్, వీజేఎస్, వైజేఎస్‌ విద్యార్థి సంఘాల నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అయితే..ఒక్కసారిగా విద్యార్థి నేతలు కిషన్‌రెడ్డి ఇంటికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరుగులతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

ఈ క్రమంలోనే పరిస్థితులు చేజారిపోతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆందోళన కారులను ఒక్కొక్కరిని వ్యానుల్లో ఎక్కించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అందరినీ పోలీస్ వాహనంలో ఎక్కించి వారిని నల్లగొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నీట్‌ పరీక్ష సమస్యపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరామనీ.. దానికి ఆయన స్పందించలేదని చెప్పారు. అందుకే కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చినట్లు విద్యార్థి సంఘం నాయకులు చెప్పారు.

Next Story