అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపైనే స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌.. స్మృతి ఇరానీ

Smriti Irani Press Meet I అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపైనే స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌.. స్మృతి ఇరానీ

By సుభాష్  Published on  25 Nov 2020 10:31 AM GMT
అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపైనే స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌.. స్మృతి ఇరానీ

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. భాగ్య‌న‌గ‌రంలో కాషాయ జెండా ఎగుర‌వేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. జాతీయ స్థాయిలో పేరున్న నాయ‌కులు వ‌చ్చి ప్ర‌చారంలో భాగం అవుతున్నారు. హైద‌రాబాద్ అభివృద్ది కోసం ప్ర‌జ‌లు భాజ‌పాకు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌లోని బీజేపీ కార్యాల‌య్యంలో ఏర్పాటు చేసిన మీడియాలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గ‌డిచిన ఐదేళ్ల‌లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో అభివృద్ది కోసం వేల‌కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసిన‌ట్లు తెరాస ప్ర‌భుత్వం అబ‌ద్దాలు చెబుతోంద‌ని విమ‌ర్శించారు.

పాతబస్తీలో రోహింగ్యాలకు ఎందుకు ఓటు హక్కు కల్పించారని కేంద్ర మంత్రి నిలదీశారు. రోహింగ్యాలు, బంగ్లా దేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు ఇచ్చారని, ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు మాట్లాడవని ప్ర‌శ్నించారు. దాదాపు 75వేల మంది విదేశీయులు అక్ర‌మంగా హైద‌రాబాద్‌లో ఎలా నివ‌సిస్తున్నారన్నారు. అక్ర‌మ చొర‌బాటుదారుల నుంచి దేశాన్ని బీజేపీ కాపాడుతుంద‌ని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుస్మాన్ భారత్‌ పథకాన్ని అమలు చేసి ఉంటే ఇప్పుడు కరోనా సోకిన నిజమైన పేదలకు లబ్ధి చేకూరేదని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టంపై సమగ్ర నివేదిక కేంద్రానికి పంపలేదని స్మృతి ఇరానీ అన్నారు. తెలంగాణ ఒక్క కుటుంబం కోసం కాదని… ఎందరో త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. పాత బ‌స్తీ అభివృద్దిని అడ్డుకుంటున్న వారిపై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణకు టెక్స్‌టైల్‌ పార్కును మంజూరు చేసిందన్నారు. కేంద్రం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో తెరాస ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని తెలిపారు.

Next Story