ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టడమే లక్ష్యం
Retas on a mission to make Rainwater a natural source.ఫాస్ట్ మూవింగ్ కంజూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ రెయిన్ వాటర్
By M.S.R
ఫాస్ట్ మూవింగ్ కంజూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్(వర్షపు నీటిని పట్టుకోవడం) చేయాలని నిర్ణయించుకుంది. ఇది Rainmxx ట్యాంక్ అనే మాడ్యులర్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్‌ను అందించే భారతీయ కంపెనీగా అయింది. దానికి Retas అనే నామకరణం చేశారు. కంపెనీ ప్రాంగణంలో మూడు రెయిన్‌మాక్స్ ట్యాంకులు, ఒక్కొక్కటి 6 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేయగలవు. వర్షాకాలం తర్వాత, వేసవి వచ్చిందంటే, కంపెనీ దాదాపు ఆరు నెలల పాటు వివిధ అవసరాల కోసం సేకరించిన వర్షపు నీటిని ఉపయోగించింది.
"దేశవ్యాప్తంగా తీవ్రమైన నీటి సంక్షోభం ఉంది. వర్షపు నీరును మనం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా చాలా మంది ప్రజలు సాంప్రదాయ వర్షపు నీటి సేకరణ (ఇటుక/సిమెంటు కంటైనర్లలో) ను పట్టించుకోవడం లేదు" అనిరెటాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అంకిత్ చెప్పారు.
Retas కు చెందిన Rainmaxx ట్యాంక్‌లు రీసైకిల్ చేయబడిన పాలీప్రొఫైలిన్‌తో తయారు చేయబడ్డాయి. వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా సులువే. వాటర్ ట్యాంక్ దాని ఉపరితలంపై ముందుగా ఫిల్టర్ చేసిన యూనిట్లను కలిగి ఉంటుంది, వివిధ ఫిల్టర్లు వర్షపు నీటిని ప్రవేశించే ముందు ఫిల్టర్ చేస్తాయి. ట్యాంక్ లోపల, జియోటెక్స్టైల్ అనే పోరస్ సింథటిక్ పదార్థం అమర్చబడి ఉంటుంది. జియోటెక్స్టైల్ అదనపు ఫిల్టర్‌గా పనిచేస్తుంది, ఇది నీటి కణాలను మాత్రమే ఉండేలా చేస్తుంది.
దాదాపు 4-5 సంవత్సరాల క్రితం, అంకిత్ మగన్, నీరజ్ చౌహాన్, ప్రియాంక్ జైన్ వర్షాకాలం సమయంలో వీధుల్లో వరదల కారణంగా ట్రాఫిక్‌ను నిలిపివేయడాన్ని చూశారు. "ఆ వర్షపు నీరంతా డ్రైనేజీకి పోతుందని మేము గ్రహించాము. ఆ సమయంలోనే retas ఐడియా వచ్చింది" అని అంకిత్ చెప్పారు. "రేటాస్ అనేది వర్షపు చినుకుకు సంస్కృత పదం. సాధ్యమయ్యే ప్రతి వర్షపు చినుకును సంరక్షించడం, ఇతర అవసరాల కోసం ఉపయోగించడం మా ప్రాథమిక దృష్టి. వర్షపు నీరు ప్రతి ఒక్కరికీ సహజ వనరుగా మారే వరకు పని చేయాలని అనుకుంటూ ఉన్నాము" అని ఆయన చెప్పారు.
Rainmaxx ట్యాంక్‌ను ల్యాండ్‌స్కేప్ ఉపరితలాల కింద నుండి.. కార్ పార్కింగ్ వరకు ఎక్కడైనా ఇన్‌స్టాల్ చేయవచ్చు. "ప్రతి రెయిన్‌మాక్స్ ట్యాంక్ చదరపు మీటరుకు కనీసం 30 టన్నులు నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మా క్లయింట్‌లలో చాలా మంది దీనిని పార్కింగ్ ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారు" అని అంకిత్ చెప్పారు.
"వరదలను తగ్గించడానికి Rainmaxx ట్యాంక్ కూడా సహాయపడుతుంది" అని ఆయన చెప్పారు. "మా ఉత్పత్తి మన్నిక కూడా చాలా ఎక్కువ కాలం ఉంటుంది. మేము వినియోగదారులకు 50 సంవత్సరాల వారంటీని అందిస్తాము," అన్నారాయన.
రెయిన్‌మాక్స్ ట్యాంకులు హైదరాబాద్‌తో సహా కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, పరిశ్రమలలో ఏర్పాటు చేయబడ్డాయి. వారి కస్టమర్లలో కొందరు IKEA, Titan, PepsiCo లాంటి సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO)తో కలిసి రేటాస్ ప్రాజెక్ట్ చేయడానికి కూడా సిద్ధమవుతోంది.
మే 2022లో హైదరాబాద్‌లో జరగనున్న INK@WASH 3.0 (ఇన్నోవేషన్స్ & న్యూ నాలెడ్జ్ ఇన్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్)లో పాల్గొనే అనేక కంపెనీలలో Retas ఒకటి.