హెల్ప్ లైన్ నెంబర్లను ఇచ్చిన జీహెచ్ఎంసీ
భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో గ్రేటర్ GHMC అధికారులు అలర్ట్ అయ్యారు.
By M.S.R Published on 11 Jun 2024 1:25 PM GMTహెల్ప్ లైన్ నెంబర్లను ఇచ్చిన జీహెచ్ఎంసీ
భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ లో ఈరోజు, రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (EV&DM) హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేసింది. హైదరాబాద్ వాసులు ఎలాంటి సమస్యలు ఉన్నా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయం కోసం GHMC హెల్ప్‌లైన్ నంబర్‌లు 040-21111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లె, భూపాలపల్లి, మెదక్, మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేటలో వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు.