అసెంబ్లీ ఎన్నిలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు: రాచకొండ సీపీ

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాచకొండ సీపీ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 Oct 2023 5:15 PM IST
rachakonda CP, DS chouhan, meeting, state elections,

అసెంబ్లీ ఎన్నిలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు: రాచకొండ సీపీ

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ పోలీసు సిబ్బందితో ఈరోజు ఉప్పల్ ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాలనీ, ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని రాచకొండ సీపీ అన్నారు.

ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్. అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని అన్నారు. ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని, ఎన్నికల నిర్వహణ పరికరాలు తీసుకెళ్ళే రూట్ చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, అధికారులు.. సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీపీ డీఎస్‌ చౌహాన్.

అత్యవసరం ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ స్టేషన్ లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ముందుగానే చూసుకోవాల అన్నారు. ప్రభుత్వ ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని, ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో ఎదురైన సమస్యలను సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఉంచాలని అన్నారు. రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలని డీఎస్‌ చౌహాన్ తెలిపారు. ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, చిన్న విషయాలైన ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండేలా చూడాలన్నారు. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ అట్టి గ్రామాలపై దృష్టిసారించాలన్నారు సీపీ డీఎస్ చౌహాన్.

Next Story