నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారిపై పడిన అటెండర్..పసికందు మృతి

నీలోఫర్‌ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. నేలపై పడుకున్న పసికందుపై అటెండర్‌ పడిపోయింది. బాబు ప్రాణాలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2023 11:07 AM GMT
Niloufer Hospital, Child Dead, Woman attender,

నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారిపై పడిన అటెండర్..పసికందు మృతి

నీలోఫర్‌ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. బాలింత తన బాబుతో ఆస్పత్రిలో పడుకుని ఉంది. మంచాలు లేకపోవడంతో నేలపైనే పడుకుంది. పక్కనే బాబుని ఉంచింది. అయితే.. మహిళా అటెండర్‌ అనుకోకుండా పసికందుపై పడిపోయింది. దాంతో.. తీవ్రగాయాలు అయ్యి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు పుట్టాడు అనే సంతోషం రెండ్రోజులు కూడా లేకుండా పోయింది. సదురు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

నాంపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 4న ఈ సంఘటన జరిగింది. పుష్పమ్మ అనే మహిళ ప్రసవం కోసం పరిగి హాస్పిటల్ కి వెళ్ళింది. పరిగి ప్రభుత్వ హాస్పిటల్ లో 1.3 కిలోల బరువుతో ఉన్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు కాస్త అనారోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. దాంతో.. నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దాంతో.. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో పుష్పమ్మను నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారు. నీలోఫర్‌ ఆస్పత్రిలోనే బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో మంచాలు అన్నీ ఆక్యుపెన్సీ కావడంతో.. పుష్పమ్మ నేలపైనే ఉండిపోయింది. బిడ్డతో పాటు నేలపైనే పడుకోసాగింది.

అయితే నీలోఫర్ లోని అదే వార్డులో గర్భిణీగా ఉన్న తన కుమార్తె కు సహాయం చేయడానికి ఒక మహిళ అటెండర్ జూలై 6న ఉదయం 7 గంటల సమయంలో వచ్చింది. పుష్పమ్మ పడుకున్న వైపు నడుస్తూ వచ్చింది. అంతే అకస్మాత్తుగా బాలుడిపై పడిపోయింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లి అరుపులతో వెంటనే వైద్యులు స్పందించారు. చికిత్స చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. దురదృష్టవశాత్తు బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాబు పుట్టాడన్న సంతోషం ఆ తల్లికి రెండ్రోజులు కూడా ఉండలేదు. దాంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మంచిర్యాల జిల్లాకు చెందిన కొమరమ్మ అనే మహిళ అటెండర్ గా పనిచేస్తున్నారు. నీలోఫర్‌లో గర్భిణీగా ఉన్న తన కూతురికి సహాయం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బాలుడిపై పడిపోవడంతో బాలుడు మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. చనిపోయిన పసికందు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసుల నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని నాంపల్లి పోలీసులు వెల్లడించారు.

Next Story