Hyderabad: డీసీపీ కుమారుడు గుండెపోటుతో మృతి

మాదాపూర్, సెంట్రల్‌ జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు ఇంట విషాద చాయలు అలుముకున్నాయి.

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 12:59 PM IST
madhapur, additional dcp venkateshwarlu, son dead,

Hyderabad: డీసీపీ కుమారుడు గుండెపోటుతో మృతి 

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మాదాపూర్, సెంట్రల్‌ జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు ఇంట విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన చిన్న కుమారుడు చంద్రతేజ్‌. చంద్రతేజ్‌కు సోమవారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆస్పత్రిలో డాక్టర్ల వైద్యానికి మొదట చంద్రతేజ్‌ స్పందించాడు. చికిత్స పొందుతూనే మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. దాంతో.. చేతికందిన కొడుకు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి.

కాగా.. అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు స్వగ్రామం నల్లగొండ జిల్లాకు చంద్రతేజ్‌ మృతదేహాన్ని తరలించారు. కాగా.. చంద్రతేజ్‌ ఓ ప్రయివేట్‌ కాలేజ్‌లో మెకానికల్ ఇంజీనీరింగ్ పూర్తి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వతహాగా వ్యాపరంలో రానిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలుస్తోంది. కానీ..ఈలోపే చిన్న కుమారుడు మృతితో చంద్రతేజ్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story