ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం (వీడియో)
హైదరాబాద్‌లో ఘనంగా గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 17 Sep 2024 9:29 AM GMTహైదరాబాద్‌లో ఘనంగా గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ వద్ద భారీ ఏర్పాట్లను చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనం జరిగింది. ఇక అంతకుముందు నిర్వాహకులు ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా.. ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. కేవలం హుండీ ఆదాయమే రూ.70 లక్షలు వచ్చిందని నిర్వాహకులు చెప్పారు.
మరోవైపు హుస్సేన్‌సాగర్ వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. నగరం నలుమూలల నుంచి వినాయకుడి విగ్రహాల నిమజ్జనాలు ఇక్కడ జరగుతున్నాయి. వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్‌కూ క్యూ కట్టాయి. శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు భక్తులు. బ్యాండ్ చప్పుళ్ల మధ్య డ్యాన్స్‌లు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య ముందుకు వస్తున్నారు. నిమజ్జనం వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు గణనాథుల విగ్రహాలు, భక్తులతో కిక్కిరిసిపోయాయి.
హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద భారీ గణేశుడిని నిమజ్జనం చేశారు. గణనాథుల నిమజ్జనం నేపథ్యంలో వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంటున్నాయి. pic.twitter.com/8TahH7X765
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 17, 2024