బంజారాహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని ఢీకొట్టి మహిళలు పరార్

మద్యం మత్తులో అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన మహిళలు, ర్యాష్‌డ్రైవింగ్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  7 July 2023 6:12 AM GMT
Hit and Run, Banjarahills, BMW Car, GHMC Employee, Injured,

బంజారాహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని ఢీకొట్టి మహిళలు పరార్

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అతివేగంతో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన మహిళలు, ర్యాష్‌డ్రైవింగ్‌ చేశారు.

బంజారాహిల్స్‌లో బీఎండబ్ల్యూ కారు (TS 09 EJ 5688) కారు రాత్రి అతివేగంతో వచ్చింది. ఖాళీగా ఉన్న రోడ్డుపై జీహెచ్‌ఎంసీ ఉద్యోగి బైక్‌పై వస్తున్నాడు. తన రూట్లోనే వెళ్తున్నాడు. కానీ ఉన్నట్లుండి తెలుపు బీఎండబ్ల్యూ కారు వేగంగా దూసుకొచ్చింది. జీహెచ్‌ఎంసీ ఉద్యోగి జి.బాలచందర్‌ బైక్‌పైకి దూసుకెళ్లింది. దాంతో అతను రోడ్డుపై దూరంగా పడిపోయాడు. కారులో ప్రమాద సమయంలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఇద్దరూ కూడా మద్యం సేవించి కారు అత్యంత వేగంతో నడిపారని స్థానికులు అంటున్నారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత అక్కడే కొద్ది క్షణాలు కారు ఆపారు. కానీ జనాలు గుమిగూడటం గమనించి అక్కడి నుంచి పరారయ్యారు కారులో ఉన్న మహిళలు. అయితే.. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా.. ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్ మేనేజర్ జి.బాలచందర్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు అధికారులు.

Next Story