HCA ఎన్నికల్లో ఉత్కంఠ పోరు, ఒక్క ఓటుతో జగన్‌మోహన్ గెలుపు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరిగా సాగాయి.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 1:11 AM GMTHCA ఎన్నికల్లో ఉత్కంఠ పోరు, ఒక్క ఓటుతో జగన్‌మోహన్ గెలుపు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరిగా సాగాయి. చివరి వరకు ఉత్కంఠను తలపించాయి. ఈ ఎన్నికల్లో అర్శనపల్లి జగన్‌మోహన్ రావు విజయం సాధించాడు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్‌మోహన్ కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచాడు. ఈయన తర్వాతి స్థానంలో శివలాల్, అర్హద్ అయూబ్ ప్యానెల్ అభ్యర్థి అమర్‌నాథ్ నిలిచాడు. కాగా.. హెచ్‌సీఏ ఎన్నికల్లో మత్తం 173 మంది ఓటర్లు ఉండగా.. 169 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీరాజ్, ప్రజ్ఞాన్ ఓజా, స్రవంతి నాయుడు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, టీఎ్‌సఆర్టీసీ వీసీ, ఎండీ సజ్జనార్ సహా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు
అధ్యక్ష పదవి ఓట్ల లెక్కింపులో తొలుత జగన్‌మోహన్ 8 ఓట్ల వెనుకంజలో నిలిచాడు. కానీ.. బలమైన వ్గాన్ని ఎదుర్కొని తొలిసారి శివలాల్, అర్హద్ నిలబెట్టిన వ్యక్తిని కాదని ఓటర్ల కొత్త అభ్యర్థిని ఎంపిక చేశారు. అనూహ్యంగా జగన్‌మోహ్ పుంజుకునొ 7 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చాడు. 55 ఓట్లు దాటాక ఒక ఓటు జగన్‌కు, మరో ఓటు అమర్‌నాథ్‌కు పడుతూ వచ్చాయి. చివరకు 63 ఓట్లు సాధించిన జగన్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అమర్‌నాథ్‌కు 62 ఓట్లు పడి రెండో స్థానంలో నిలిచాడు. ఇతర అభ్యర్థుల్లో అనిల్ (వివేక్ ప్యానెల్)కు 34, పీఎల్ శ్రీనివాస్‌కు 10 ఓట్లు వచ్చాయి. గెలుపు తర్వాత జగన్‌మోహన్ అభిమానులు, ఫాలోవర్లు విజయసంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి.. డీజేతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత జగన్ మోహన్‌ను ర్యాలీగా ఊరేగించారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా గెలిచిన జగన్‌మోహన్‌కు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక హెచ్‌సీఏ ఎన్నికల్లో నిలిచిన నాలుగు ప్యానెళ్లలో పీఎల్ శ్రీనివాస్ వర్గానికి ఒక్క పదవి కూడా రాలేదు. ధ్యక్ష, కోశాధికారి పదవులను జగన్ ప్యానెల్, ఉపాధ్యక్ష, సహాయ కార్యదర్శి పదవులను వివేక్ ప్యానెల్, కార్యదర్శి, కౌన్సిలర్ పోస్టులను శివ్‌లాల్, అర్షద్ ప్యానెల్ చేజిక్కించుకున్నాయి.
అధ్యక్షుడు: జగన్‌మోహన్ రావు - (63 ఓట్లు)
ఉపాధ్యక్షుడు: దల్జిత్ సింగ్ - (63 ఓట్లు) వివేక్ ప్యానెల్
కార్యదర్శి: దేవ్‌రాజ్ (77 ఓట్లు) శివలాల్ ప్యానెల్
సహాయ కార్యదర్శి: బసవరాజ్ (60 ఓట్లు) వివేక్ ప్యానెల్
కోశాధికారి: సీజే శ్రీనివాస్ (64 ఓట్లు) జగన్ ప్యానెల్
కౌన్సిలర్: సునీల్ (59 ఓట్లు) శివలాల్ ప్యానెల్