జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. టీఆర్ఎస్‌ రెండో జాబితా విడుద‌ల‌

GHMC Elections.. TRS Second list .. గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నిక ప్ర‌క్రియ‌లో

By సుభాష్  Published on  19 Nov 2020 10:40 AM GMT
జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. టీఆర్ఎస్‌ రెండో జాబితా విడుద‌ల‌

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నిక ప్ర‌క్రియ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్) ఇత‌ర పార్టీల కంటే దూసుకుపోతోంది. బుధవారం 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన తెరాస‌.. నేడు రెండో విడుత జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 20 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 150 డివిజన్లు ఉన్న గ్రేటర్‌లో ఇప్పటి వరకు టీఆర్ఎస్‌ 125 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టు అయ్యింది. రెండవ జాబితాలో ఆరుగు సిట్టింగ్‌లకు మొండిచేయి చూపించింది. ఏడుగురు సిట్టింగ్‌ కార్పొరేటర్లకు మరోసారి అవకాశం దక్కింది. నామినేష‌న్లు రేపు ఆఖ‌రి రోజు కాగా.. డిసెంబ‌ర్ 1న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

టీఆర్ఎస్ రెండో జాబితా :

1.మల్లాపూర్‌ - దేవేందర్‌రెడ్డి

2. రామాంతపూర్‌ - జోత్స్న

3. బేగంబజార్‌ - పూజా వ్యాస్‌ బిలాల్‌

4. సులేమాన్‌ నగర్‌ - సరితా మహేష్‌

5. శాస్త్రిపురం - రాజేష్‌యాదవ్‌

6. రాజేంద్రనగర్‌ - శ్రీలత

7. హిమాయత్‌నగర్‌ - హేమలత యాదవ్‌

8. బాగ్‌అంబర్‌పేట - పద్మావతి రెడ్డి

9. భోలక్‌పూర్‌ - నవీన్‌కుమార్‌

10. షేక్‌పేట్‌ - సత్యనారాయణ యాదవ్‌

11. శేరిలింగంపల్లి - రాగం నాగేందర్‌

12. అడ్డగుట్ట - ప్రసన్న లక్ష్మి

13. మెట్టుగూడ - రాసూరి సునీత

14. బౌద్ధనగర్‌ - కంది శైలజ

15. బేగంపేట్‌ - మహేశ్వరి శ్రీహరి

16. వివేకానందనగర్‌ కాలనీ - రోజా రంగారావు

17. వినాయక్‌నగర్‌ - బద్ధం పుష్పలతరెడ్డి

18. బాలానగర్‌ - రవీందర్‌రెడ్డి

19. కూకట్‌పల్లి - సత్యనారాయణ జూపల్లి

20. మైలార్‌దేవ్‌పల్లి - ప్రేమ్‌దాస్‌ గౌడ్‌

Next Story