మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. ఇప్పటి వరకు 146 డివిజన్ల ఫలితాలు వెల్లడి

GHMC Election results I మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. ఇప్పటి వరకు 146 డివిజన్ల ఫలితాలు వెల్లడి

By సుభాష్  Published on  4 Dec 2020 1:48 PM GMT
మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. ఇప్పటి వరకు 146 డివిజన్ల ఫలితాలు వెల్లడి

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ తుది దశకు చేరుకుంది. దాదాపు 140 డివిజన్లకుపైగా ఫలితాలు వెలువడ్డాయి. ఇక గ్రేటర్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠం కోసం పొత్తు తప్పదా.. లేదా.. ఎక్స్‌అఫీషియో ఓట్లతోనే మేయర్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ దక్కించుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది. 100 సీట్లు వస్తేనే మేయర్‌ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్‌ఎస్‌కు 66 కంటే తక్కువ మాత్రమే వస్తే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాల్సిందే. జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌ అఫీషియో ఓటు వేయడానికి 51 మంది అర్హత కలిగి ఉన్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌ 34 మందికి, ఎంఐఎం 10 మంది, బీజేపీ ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్కరు మాత్రమే.

ఈ విధంగా చూస్తే 34తో పాటు 66 డివిన్లు గెలిస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవచ్చు. అలా కుదరని పక్షంలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటుంది. కాగా, టీఆర్‌ఎస్‌ 56, బీజేపీ 46, ఎంఐఎం 42, కాంగ్రెస్‌ 2 చొప్పున స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 146 డివిజన్ల ఫలితాలు రాగా, మిగతా డివిజన్ల ఫలితాలు రావాల్సి ఉంది.

Next Story