హైదరాబాద్‌: గ్రేటర్‌లో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితా విడుదల

GHMC election- Crime Backround corporators .. తెలంగాణ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నేరచరిత్ర కలిగిన కార్పొరేటర్ల జాబి

By సుభాష్  Published on  6 Dec 2020 2:27 AM GMT
హైదరాబాద్‌:  గ్రేటర్‌లో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితా విడుదల

తెలంగాణ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నేరచరిత్ర కలిగిన కార్పొరేటర్ల జాబితాను ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌లో నేర చరిత్ర కలిగిన కర్పొరేటర్లు 25 మంది ఉన్నట్లు వెల్లడించింది. అందులో బీజేపీలో 10, టీఆర్‌ఎస్‌ 8, ఎంఐఎంలో 7గురు ఉన్నట్లు తెలిపింది. ఇక తాజాగా జారిగిన ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు 55 స్థానాలు రాగా, బీజేపీ 48 స్థానాలు, ఎంఐఎం 44, కాంగ్రెస్‌కు రెండు స్థానాలు వచ్చాయి.- 2 సీట్లు గెలిచాయి .

ఇక గత గ్రేటర్‌ ఎన్నికల్లో 30 మంది నేరిత్ర కలిగిన వారు గెలుపొందగా, ఈ సారి 25 మంది నేర చరిత్ర ఉన్నవారు గెలుపొందినట్లు ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రకటించింది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు టికెట్‌ ఇవ్వవద్దని ఫోరమ్‌ కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల ముందు 49 మంది అభ్యర్థులు నేర చరిత్ర కలిగిన వారి జాబితాను బయటపెట్టింది. తాజాగా గ్రేటర్‌ ఎన్నికలు ముగియడంతో విజయం సాధించిన కార్పొరేటర్లలో నేర చరిత్ర ఉన్నవారి జాబితాను విడుదల చేసింది.

Next Story