పార్కింగ్ రుసుము వసూళ్లపై GHMC కమిషనర్ ఆమ్రపాలి సీరియస్
ఫ్రీ పార్కింగ్ కల్పించాల్సిన చోట కొందరు ఫీజులు వసూలు చేయడంపై GHMC కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 6:30 AM GMTపార్కింగ్ రుసుము వసూళ్లపై GHMC కమిషనర్ ఆమ్రపాలి సీరియస్
ఫ్రీ పార్కింగ్ కల్పించాల్సిన చోట కొందరు ఫీజులు వసూలు చేయడంపై GHMC కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు. నిబంధనలు ఉల్లింఘించడంపై మండిపడ్డారు. ఇటీవల ఆమె పలు థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని థియేటర్లలో అక్రమ పార్కింగ్ వసూళ్లు వెలుగులోకి వచ్చాయి. కొన్ని యాజమాన్యాలు ఒకే తెర కలిగి.. మూడు, నాలుగు స్క్రీన్స్‌ను నడిపిస్తున్నట్లు గుర్తించారు. వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెచ్చరించారు. అలాగే థియేటర్లలో ఆహారం నాసిరకంగా ఉండటంపైనా GHMC అధికారులు సీరియస్‌గా ఉన్నారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉచిత పార్కింగ్ ఇవ్వాల్సిన ప్రదేశాల్లో రుసుము అక్రమంగా వసూలు చేయడంపై ఆమ్రపాలి మండిపడ్డారు. న్ని మాల్స్ థియేటర్లు, మల్టీ ప్లెక్స్‌లలో నిబంధనలు ఉల్లఘించినట్లు గుర్తించామనీ.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. తనిఖీలలో నిబంధనలను పాటించని మాల్స్‌కు, మల్టీప్లెక్స్‌లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు, పెద్ద పెద్దా షాపింగ్ మాల్స్‌లో మొదటి అరగంట ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దన్నారు.
అంతేకాదు.. ఆమ్రపాలి హైదరాబాద్ నగర వాసులకు పలు సూచనలు చేశారు. జీఐఎస్ సర్వేలో పౌరుల నుంచి సేకరిస్తున్న భవనాలు, నీటి, విద్యుత్‌బిల్లుల సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. ఆధార్ నంబర్, వ్యక్తిగత వివరాలు సిబ్బంది సేకరించరని.. ఒకవేళ సిబ్బంది అడిగినా ఇవ్వొద్దని హైదరాబాద్ ప్రజలకు ఆమ్రపాలి సూచన చేశారు. ఆస్తుల నిర్వహణ, యుటిలిటీ మ్యాపింగ్ కోసం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.