డ్రగ్స్ కేసులోనూ విదేశాలకు ప్రాఫిట్ మళ్లింపు

హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on  25 July 2023 12:45 PM GMT
drugs case, profit Diversion, abroad,

డ్రగ్స్ కేసులోనూ విదేశాలకు ప్రాఫిట్ మళ్లింపు 

హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఎస్ఓటి బృందాలు, నార్కోటిక్ బృందాలను ఏర్పాటు చేసి డ్రగ్స్‌ మాఫియాపై నిఘా పెడతున్నారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలను పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు పోలీసుల కంట పడకుండా రహస్యంగా డ్రగ్స్ ని హైదరాబాదుకు తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ముగ్గురు నైజీరియన్లతో పాటు ఇద్దరు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్‌ చేసినవారి బ్యాంకు లావాదేవీలపై హైదరాబాద్ పోలీసులు ఆరా తీశారు. ఆ క్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొన్నటికి మొన్న ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అమాయకమైన జనాలకు గాలం వేసి, వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి చైనా, దుబాయ్ కి తరలించినట్లు గానే డ్రగ్స్ కేసులో కూడా విదేశాలకు ప్రాఫిట్ మళ్ళిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ అయిన వారి లావాదేవీలపై దృష్టి పెట్టి మొత్తం కూపీ లాగడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కోసం కస్టమర్ల నుండి వసూలు చేసిన నాలుగు కోట్ల రూపాయలు 22 విదేశీ అకౌంట్లకు మళ్ళించినట్లుగా గుర్తించారు. హెన్రీ అనే డ్రగ్ సప్లయర్ 22 అకౌంట్లను ఆపరేట్ చేస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. అయితే ఆ 22 బ్యాంక్ అకౌంట్స్ పరిశీలన కోసం హైదరాబాద్ పోలీసులు ప్రైవేట్ ఏజెన్సీని ఆశ్రయించారు. ఈ నైజీరియన్ల వద్ద నుండి 200 మంది కస్టమర్లు డ్రగ్స్ సేకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. అందులో 90 శాతం మంది బెంగళూరుకు చెందిన కస్టమర్లు ఉండగా, మరో పది శాతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కస్టమర్లు ఉన్నట్లు తెలిపారు పోలీసులు.

తెలుగు రాష్ట్రాల్లో కస్టమర్స్ గా ఉన్నవారు బెంగళూరులో చదువుకునే రోజుల్లో డ్రగ్స్ కొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా డ్రగ్స్ కోసం కస్టమర్ల నుండి వసూలు చేసిన రూ.4 కోట్లను 22 విదేశీ అకౌంట్లకు మళ్లించారని పోలీసులు వివరించారు. అకౌంట్లను ఆపరేట్‌ చేసిన హెన్రీ గురించి హైదరాబాద్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

Next Story