HCAలో అక్రమాలపై విచారణ చేయాలని ఎంపీ చామల ఫిర్యాదు
జిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ ఏడీజీకి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేశారు
By Srikanth Gundamalla Published on 23 Sept 2024 5:26 PM ISTహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలపై విచారణ చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ ఏడీజీకి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేశారు. హెచ్‌సీఏలో ట్రాన్స్‌పోర్ట్, క్యాటరింగ్ టెండర్లలో అక్రమాలు జరిగాయనే అనుమానాలున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రెసిడెంట్, సెక్రటరీ చేతుల్లోనే అధికారాలు కేంద్రీకరించారని అన్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో క్యాటరింగ్, రవాణా సేవల కోసం టెండర్ ప్రక్రియపై ఉన్న ఆందోళనలతో సహా అనేక క్లిష్టమైన సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని, అవసరమైన విధానాలను దాటవేస్తోందని చెప్పారు. ఇది అసోసియేషన్ పనితీరును ప్రభావితం చేస్తుందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆందోళనలను నివేదించి, అధికారిక దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.
కొన్ని అంశాలను ప్రధానంగా ఎంపీ చామల పేర్కొన్నారు. అందులో అధికారం మరియు పాలన యొక్క అసమతుల్యత, క్యాటరింగ్ మరియు రవాణా సేవల కోసం టెండర్ ప్రక్రియ వివాదం, CEO నుండి అప్‌డేట్‌లు లేకపోవడం, మీటింగ్ మినిట్స్ సర్క్యులేట్ చేయడంలో వైఫల్యం, ఆర్థిక అక్రమాలు మరియు ఆడిటర్ సిఫార్సులు, AGM నిర్ణయాలు మరియు చట్టపరమైన విషయాల అమలు తోపాటు కొన్ని క్లిష్టమైన సమస్యలను భువనగిరి ఎంపీ చామల ఫిర్యాదులో పేర్కొన్నారు.