పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలి.. అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
Akbaruddin owaisi sensational comments .. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీల మధ్య వాడీ
By సుభాష్ Published on
25 Nov 2020 11:29 AM GMT

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీల మధ్య వాడీవేడి మాటల యుద్ధం కొనసాగుతోంది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమాతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. నేతలు సై అంటే సై అంటూ మాటలు తూటాలు వదులుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్నారు. నిన్నటి వరకు కూల్‌గా ప్రచారం చేసిన ఎంఐఎం ఒక్కసారిగా హీట్ పెంచింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
4700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈరోజు కనీసం 700 ఎకరాలు కూడా లేదన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామని చెబుతున్నారని.. హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని అక్బరుద్దీన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసన్నారు. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని, మైనారిటీల అభివృద్ధికి వైఎస్సార్ కృషి చేశారని అక్బరుద్దీన్ పేర్కొన్న
Next Story