అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

By Newsmeter.Network  Published on  3 Jan 2020 1:37 PM GMT
అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

ఈ-కామర్స్‌ పేరు తో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను హైద్రాబాద్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్బంగా సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌లోని కబీర్‌పూర్‌కు చెందిన ముఠాలోని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడైన సందీప్ కుమార్ మరో ముగ్గురిని అరెస్టు చేశామని ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ముఠా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి వెబ్‌సైట్ల నుంచి డేటాను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. వారి వద్ద 12 సెల్‌ఫోన్‌లు, 2 ల్యాప్‌టాప్‌లు, 1 స్కానర్‌​ ప్రింటర్‌ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి 5 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు విచారణలో తెలిసిందన్నారు.

ఈ క్రమంలో ఓ మహిళా స్నాప్‌డీల్లో పొటాటో కటర్ను కొనుగోలు చేసిందని. ఆమె సమాచారాన్ని తెలుసుకున్న నిందితులు ఆమెకు ఫోన్ చేసి మీకు మొదటి బహుమతీగా రూ. 6 లక్షల 90 వేలు విలువ చేసే కారు గెలుపొందారని చెప్పి. రిజిస్ట్రేషన్‌ కు ఆమె నుంచి రూ . 2 లక్షల 30 వేల నగదును వసూలు చేశారని మీడియాతో వెల్లడించారు . ఈ ముఠా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల యొక్క నకిలీ వెబ్ సైట్లు సృష్టించారని తెలిపారు. బహుమతులు గెలుచుకున్నారని ఫోన్ లు కానీ మెసేజ్ లు లాంటివి వస్తే వాటిని నమ్మోద్దని అన్నారు.

Next Story