టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌పై చీటింగ్ కేసు, అరెస్ట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 7:13 AM GMT
టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌పై చీటింగ్ కేసు, అరెస్ట్..!

హైదరాబాద్: టీవీ మాజీ సీఈవో రవి ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవి ప్రకాష్ ఇంటికి 10 మంది పోలీసుల బృందం వెళ్లింది. కారణం చెప్పకుండానే రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో..ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండానే పోలీసులు రవి ప్రకాష్‌ను తీసుకెళ్లారు. అలంద మీడియా కేసులో రవి ప్రకాష్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

రవిప్రకాష్ ,మూర్తి లిద్ద్దరు రూ.12 కోట్లు tv9 నిధులను స్వాహా చేసారని అలందా మీడియా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరో ఉద్యోగి పెరీరా కూడా రూ.6 కోట్ల నిధులు గోల్ మాల్ చేశారని చెబుతున్నారు. రవి ప్రకాష్ బృందం మొత్తం రూ.18 కోట్లు గోల్ మాల్ చేసినట్లు అలందా మీడియా యాజమాన్యం ఫిర్యాదు చేసింది. రవి ప్రకాష్ బృందంపై చీటింగ్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

గతంలో టీవీ స్టూడియోకి వచ్చి పోలీసులను బెదిరించారనే ఆరోపణలు రవి ప్రకాష్ పై ఉన్నాయి. విధులకు ఆటంకం కలిగించారని కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో పీఎస్ కు రమ్మని బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.

Next Story
Share it