హైదరాబాద్ : అమీర్‌ పేటలో సైటింస్ట్ మర్డర్‌ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు శ్రీనివాస్‌ను వెస్ట్ జోన్ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ప్రధాన కారణం స్వలింగ సంపర్కంగా పోలీసులు తేల్చారు. చాలా కాలం నుంచి సైంటిస్ట్ సురేష్, శ్రీనివాస్‌ల మధ్య రిలేషన్ ఉందని పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్‌ ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. కొబ్బరి బోండాల కత్తితో సురేష్ మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. కత్తితోపాటు రెండు సెల్‌ ఫోన్‌లు, రెండు ఉంగరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.