అంబర్ పేట్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం ..ఆటో డ్రైవర్ కి గాయాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 4 Oct 2019 1:36 PM IST

హైదరాబాద్ : అంబర్ పేట్‌లోని ఇరానీ హోటల్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్‌లు ఫెయిలయ్యి అదుపు తప్పి కరెంట్ స్తంభానికి ఢీ కొట్టింది. ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ బయల్దేరింది బస్సు. ఇమిలీబండి బస్టాండ్ దగ్గరకు రాగానే బ్రేక్ ఫెయిల్ అవడంతో బస్సును డ్రైవర్ అదుపుచేయలేకపోయారు. రెండు కార్లను ఢీకొట్టాడు. అక్కడే ఉన్న ఆటో మీదకు బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
Next Story