హైదరాబాద్‌: నగర శివారులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్సైపై హత్యాయత్నం కూడా చేశారు. ఆయన తృటిలో తప్పించుకున్నారు. నగల షోరూంలో దోపిడీకి దొంగలు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన ఎస్సైపై కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో దుండిగల్ ఎస్సై శేఖర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రాణాలకు తెగించి సినీ ఫక్కీలో కారును వెంబడించారు పోలీసులు. అయితే..దొంగలు దూలపల్లి ఫారెస్ట్‌లోకి పరారయ్యారు. దొంగల కార్‌, కట్టర్‌, షట్టర్‌ తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్వాల్‌లో దొంగిలించిన కారుతో దొంగలు దోపిడీ యత్నం చేశారు. అంతేకాదు..మరో రెండుఏటీఎంల్లో దోపిడీకి విఫలయత్నం చేశారు. పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.