హైదారాబాద్ : నిలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్​పై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. క్లినికల్ ట్రయల్స్ జరిగిన పిల్లలతో కమిటీ సభ్యులు మాట్లాడారు.  వారి తల్లిదండ్రులను కూడా విచారించారు. నిలోఫర్‌ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ ఎథికల్‌గానే జరుగుతున్నాయని విచారణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆసుపత్రి పిల్లల వైద్య విభాగాధిపతి గదితోపాటు… వైద్య చికిత్స జరిగిన గదులను పరిశీలించారు. బోర్డు రూమ్‌లో ఆసుపత్రి సూపరింటెండెంట్​తోపాటు వైద్యులు రవికుమార్‌ను కూడా కమిటీ విచారించింది. ఇవాళ రాత్రిలోపు ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ త్రిసభ్య కమిటీలో డాక్టర్ రాజారావు, లక్ష్మీ కామేశ్వరీ, విమలా థామస్‌లు ఉన్నారు…..దీనిపై స్పందించిన డాక్టర్. లాలూ ప్రసాద్ రాథోడ్ నిలోఫర్‌ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ నివేదిక నామమాత్రంగా వస్తే సి.బి.ఐ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.