అమీర్ పేటలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Oct 2019 9:30 PM IST
హైదరాబాద్ : ఎస్‌ఆర్. నగర్ పీఎస్ పరిధిలోని అమీర్ పేటలో సురేష్ కుమార్ అనే వ్యక్తి తన ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ మాజీ ఉద్యోగి. మృతుని సురేష్ భార్య చెన్నైలో ఉంటారు. భార్య కాల్ చేసినా లిప్ట్ చేయకపోవడంతో ..అమీర్ పేట్ లోని సురేష్ ఇంటికి వచ్చారు ఉద్యోగులు. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళం పగలకొట్టి చూశారు. ఇంట్లోకి వెళ్లి చూడగా..సురేష్ విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెస్ట్ జోన్ ఇంచార్జి డీసీపీ సుమతి,ఎస్ ఆర్ నగర్ పోలీసులు, క్లూస్ టీమ్స్ చేరుకున్నాయి. సురేష్ తలపై గాయాలను పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Next Story