హైదరాబాద్‌ : దేశంలోనే మొదటి బయోమెథనైజేషన్ ప్లాంట్‌ను జీహెచ్‌ఎంసీ పరిధిలో మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. చందానగర్‌ సర్కిల్ దీప్తి శ్రీ నగర్ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లో దీనిని ప్రారంభించారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 80 క్యూబిక్ మీటర్ల పరిమాణం గల బయోగ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. దీనికి ఒక మెట్రిక్ టన్ను తడి చెత్త అవసరం. 80 క్యూబిక్ మీటర్ల బయో గ్యాస్ ద్వారా 16 గంటలపాటు నిరంతర మంటలు ఉంటాయి.

ఈ ప్లాంట్ కెపాసిటిని పెంచే ప్రతిపాదన ఉన్నట్లు మేమర్‌ రామ్మోహన్ చెప్పారు. ఇదే గ్యాస్ ప్లాంట్లను నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బల్క్ గార్బేజ్ ను ఉత్పత్తి చేసే స్టార్ హోటల్స్‌, , గేటెడ్ కమ్యూనిటీల తడి చెత్త సేకరిస్తామన్నారు. దాని నుంచి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.