పీవీపీపై బండ్ల గణేష్ ఫిర్యాదు..నన్నే బెదిరించారన్న పీవీపీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 7:44 AM GMT
పీవీపీపై బండ్ల గణేష్ ఫిర్యాదు..నన్నే బెదిరించారన్న పీవీపీ..!

హైదరాబాద్‌ : తనపై పీఎస్‌లో బండ్ల గణేష్‌ ఫిర్యాదు చేయడంపై ప్రముఖ నిర్మాత పీవీపీ స్పందించారు. 2013లో టెంపర్ సినిమా కోసం తన దగ్గర రూ.30 కోట్లు బండ్ల గణేష్ అప్పు తీసుకున్నారని చెప్పారు. రూ.30 కోట్లలో రూ.7 కోట్లు ఇంకా ఇవ్వలేదని తెలిపారు. గత కొంత కాలంగా బండ్ల గణేష్ అప్పులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని పీవీపీ ఆరోపించారు. సోమవారం పార్క్‌ హయత్‌లో బండ్ల గణేష్ కలిశాడన్నారు. తనకు ఇవ్వాల్సిన రూ.7 కోట్లు గురించి అడిగినట్లు పీవీపీ చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో పో అని బండ్ల గణేష్ తనను బెదిరించాడని పీవీపీ తెలిపారు. తనకు హోం మంత్రి అండ ఉందని తనను బండ్ల గణేష్ బెదిరించాడని పీవీపీ చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమలో చాలా మందికి ఫైనాన్స్ చేశానని..కొంత మంది తిరిగి ఇచ్చారు..మరికొంత మంది తిరిగి ఇవ్వలేదన్నారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన దగ్గరకు వచ్చి సెటిల్ చేసుకోవాలని బెదిరించారన్నారు. 40 నిమిషాలు తన ఇంటి చుట్టూ తిరిగి అనుమానాస్పదంగా కనిపించారన్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చానని బండ్ల గణేష్ నిరూపిస్తే..రూ.30 కోట్లు తిరిగి ఇస్తానన్నారు పొట్లూరి. తన దగ్గర ఆధారాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లను పోలీసులకు ఇచ్చినట్లు పీవీపీ చెప్పారు. పోలీసులు విచారించి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు పొట్లూరి తెలిపారు.

Next Story
Share it