హైదరాబాద్ : సమాజంలో రోజు రోజుకూ మనుషుల మధ్య మానవత్వం మంటగలిసి పోతోంది. తల్లీ పిల్లల మధ్య కూడా మాతృత్వం తగ్గిపోతుందా..? తల్లి వెచ్చని పొదిగిల్లలో ఒదిగి ఆదమరచి నిదుర పోవాల్సిన పసికందు ను నిర్దాక్షిణ్యం గా విసిరిపారేసిందో కసాయి తల్లి. ఆడ పిల్ల పుట్టిందనా..? లేక చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికా..?
సభ్య సమాజం తల దించుకునే ఈ ఘటన జీడిమెట్ల పియస్ పరిధిలో చోటుచేసుకుంది. 3 రోజుల ఆడ శిశువును అపరూపకాలనీలో వదిలి వెళ్లిందో కసాయి తల్లి. పాప ఏడుపు విని అటుగా వెలుతున్న వారు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది పసికందును పరీక్షించి వైద్యం అందించి ఆస్పత్రికి తరలించారు.