దసరా దాండియాలతో హైదరాబాద్‌లో సందడే సందడి
By Newsmeter.Network Published on 7 Oct 2019 7:31 PM ISTహైదరాబాద్: దసరా అంటేనే సందడి. సందడి మొత్తం దాండియాలోనే ఉంటుంది. ఆడవాళ్లు అందంగా ముస్తాబై..దాండియా ఆడుతుంటే కచ్చితంగా చూసి తీరాల్సిందే. దసరా సందర్భంగా హైదరాబాద్ ..జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో అమ్మాయిలు ఆడి పాడారు. నిజమైన దసరాను కళ్ల ముందు చూపించారు.
హైదరాబాద్ అంతా దాండియాలతో మారుమోగుతుంది. కోలాటం ఆడుతూ..పాటలు పాడుతూ..మ్యూజిక్ కు తగ్గట్లుగా మహిళలు డాన్స్ చేయడమే దాండియా. దీనిలో మగవాళ్లు కూడా పాల్గొంటారు. అందరూ పాటలకు తగ్గ స్టెప్పులేస్తుంటే కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. టీనేజ్ అమ్మాయిలు ఎంతో ఉత్సాహంగా డాన్స్ లు వేస్తుంటారు. అలసటలేని అదిరే స్టెప్పులు వేస్తుంటారు. ఆ స్టెప్పులను చూడటానికి వచ్చే అబ్బాయిలుతో దాండియా మరింత రంజుగా ఉంటుంది.
దాండియా ఉత్తర భారత దేశ ఆచారం. కాని..హైదరాబాద్ మినీ ఇండియా. ఈ కల్చర్ లో దాండియా కూడా కలిసి పోయింది. నార్త్ ఇండియా ఆచారం అయినప్పటికీ తెలుగు వారు తమదిగా చేసుకున్నారు.బతుకమ్మ చుట్టూ ఆడిపాడటమే కాదు..దాండియాలో వెస్ట్రన్ మ్యూజిక్ కలిపి డాన్స్ లు చేస్తున్నారు. మొత్తానికి దసరా..ఒక అందమైన జ్ఞాపకం.