హైదరాబాద్‌: భాగ్యనగరంలో వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపాడు. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి యమ బాదుడు బాదాడు. ఈ రోజు మధ్యాహ్నం నుంచే హైదరాబాద్‌లో భారీ వానలు కురుస్తున్నాయి. సికింద్రాబాద్‌లో రోడ్లు చెరువులు అయ్యాయి. ఇక హిమాయత్ నగర్, తాడ్ బండ్, బోయినపల్లిలో భారీ వానకు కిలో మీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హిమాయత్ నగర్‌ రోడ్డు పూర్తిగా జలమయం అయింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.