హుజూర్ నగర్ సీపీఎం అభ్యర్థిని ప్రకటించిన తమ్మినేని వీరభద్రం
By న్యూస్‌మీటర్ తెలుగు
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సీపీఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాలెపల్లి శేఖర్ రావును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితం రాష్ట్ర ప్రభుత్వం పై పెద్దగా ప్రభావం చూపదని.. కానీ రాష్ట్రంలో ఒక చర్చ జరగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. డబ్బు ప్రభావం వల్ల రాజకీయంగా కమ్యూనిస్టులు బలహీన పడిన మాట వాస్తవమేనని.. అయితే కమ్యూనిస్టులు చట్ట సభల్లో ఉన్నప్పటికి.. లేనప్పటికీ తేడా స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కమ్యూనిస్టులు ఉన్నపుడు చర్చ అర్థవంతంగా ఉండేదని అన్నారు.
కాగా.. రేపు ఉదయం 11గంటలకు సీపీఎం అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున ర్యాలీకి ఏర్పాట్లు చేశామని.. టీజెఎస్, టీడీపీ, ఇతర కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. టీడీపీ స్వంతంగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు ఫోన్ లో తెలియజేసారని అన్నారు.