సూర్యాపేట : ఎస్పీ రావి వెంకటేశ్వర్లును ఎన్నికల సంంఘం బదిలీ చేసింది. హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెంకటేశ్వర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశించింది. 2012 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన భాస్కరన్ కి ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించింది.  వెంకటేశ్వర్లపై పలు ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్పీ వెంకటేశ్వర్లపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లను బదిలీ చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ  కూడా స్వాగతించింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు హుజూర్‌ నగర్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నారని దీనిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.