సూర్యాపేట జిల్లా: హుజుర్ నగర్ ఉప ఎన్నిక కు పోటీలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీనికి సంబంధించిన ఫామ్ 7Aను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు. నలుగురు మినహా మిగతా స్వాతంత్ర్య అభ్యర్ధులు అందరూ కూడా హుజూర్ నగర్‌ నియోజకవర్గంలో ఓటు హక్కులేని వారు ఉండటం గమనార్హం.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు పలికింది. కాంగ్రెస్‌కు టీజేఎస్‌ సపోర్ట్ చేస్తుండటంతో ప్రధాన పార్టీల గెలుపు ఉత్కంఠ నెలకొంది. సీపీఎం అభ్యర్ది నామినేషన్ రిజక్ట్ కావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో గెలుపుపై ధీమాగా ఉంది గులాబీ పార్టీ.

హుజూర్‌ నగర్ కు ఈ నెల21 ఉప ఎన్నిక జరగనుంది. 24న ఫలితాలు వెలువడనున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.