తెలంగాణాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు, 1,700మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్ది సైదిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.హుజూర్‌ నగర్‌లో ఉదయం  3గంటకు 69.95 శాతం పోలింగ్ నమోదైంది.

Huzur Copy

Huzurnagar

Huzurnagar By Election Polling Live Updates - Sakshi

2,200మంది పోలీసులు పోలింగ్ బూత్ ల బందోబస్తులో పాల్గొంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గంలో మొత్తం 2,36,842 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు, బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, బీజేపీ నుంచి రామారావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ముఖ్యపోటి ఉన్నట్టు తెలుస్తోంది.

మహారాష్ట్ర, హర్యానాలలో అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఈ రోజు (అక్టోబర్ 21న) ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హర్యానాలో 75వేల మంది సిబ్బందిని నియమించారు. దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

సత్య ప్రియ బి.ఎన్