ప్రచారంలో దూసుకెళ్తున్న ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 7:56 AM GMT
ప్రచారంలో దూసుకెళ్తున్న ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి

సూర్యాపేట జిల్లా: హుజూర్‌ నగర్‌లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ రోజు నుంచి అన్ని పార్టీలు అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ప్రచారంలో ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి ముందంజలో ఉన్నారు. అయితే... టీఆర్‌ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో సెక్షన్‌ 30ని అమల్లోకి తెచ్చారు. వాహనాల తనిఖీకి ప్రత్యేక చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. హూజుర్‌నగర్‌లో పోటీ చేయాలని ఇప్పటికే టీడీపీ నిర్ణయించుకుంది. అయితే..వైఎస్ఆర్ సీపీ కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఇంటి పార్టీ తరపున తీన్మార్‌ మల్లన్న ఈ రోజు నామినేఫషన్ వేయనున్నారు. డబ్బు, మద్యాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు.

Next Story
Share it