సూర్యాపేట జిల్లా: హుజూర్‌ నగర్‌ ఎన్నికలు తెలంగాణలో వేడి పుట్టిస్తున్నాయి. ప్రచారంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి పద్మావతి రెడ్డితో పాటు ఆమె భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్‌ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ తరువాత జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో..హుజూర్‌ నగర్‌ కు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే..ప్రచారం సందర్భంగా ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.