హుజూర్‌ నగర్‌కు రేపు అభ్యర్ధిని ప్రకటించనున్న టీడీపీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2019 3:39 PM GMT
హుజూర్‌ నగర్‌కు రేపు అభ్యర్ధిని ప్రకటించనున్న టీడీపీ

హుజూర్‌ నగర్‌: ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటికి దిగాలని టీడీపీ నిర్ణయానికి వచ్చింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా, ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా బరిలోకి దిగాలని తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతానికి టీడీపీ హుజూర్‌ నగర్‌ అభ్యర్ధులుగా కిరణ్మయి, నర్సింహులు గౌడ్, నన్నురి నర్సిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే..బీసీ అభ్బర్ధికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Next Story
Share it