భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేసిన తండ్రి ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 1:05 PM GMT
భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేసిన తండ్రి ..!

ప్రకాశం జిల్లా: రాచర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది గుమ్మల్ల చిన్న పుల్లయ్య అనే వ్యక్తి భార్యపై అనుమానంతో 8 నెలల కన్నకొడుకుని చంపేశాడు. హేమంత్ కుమార్ ని నేలకేసి కొట్టి పాశవికంగా చంపాడు.

భార్య రమాదేవిపై అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు భార్యను కత్తితో గాయపరచడమే కాకుండా రోకలి బండతో దారుణంగా దాడి చేశాడు.తీవ్రంగా గాయపడ్డ భార్యను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

గతంలో కూడా చిన్న పుల్లయ్య అర్ధవీడు మండలం మోహదిపురం లో ఉండేవాడు. మొదటి భార్య గుమ్మల్ల లక్ష్మీదేవి అనే మహిళ వివాహం చేసుకొని..ఆమెపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. దీనికి 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. రెండు సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్న పుల్లయ్య అనుమానంతో తన కొడుకుని చంపడమే కాకుండా ..భార్యను తీవ్రంగా గాయపరిచాడు .

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

Next Story
Share it