మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 5:58 AM GMT
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

హైదరాబాద్: పంజాగుట్ట అంటేనే ట్రాఫిక్‌కు కేరాఫ్. వేల వాహనాలు వస్తూపోతుంటాయి. లక్షల మంది నడుస్తూ వెళ్తుంటారు. వాహనాల హారన్‌లు, కాలుష్యం. పంజాగుట్ట సెంటర్ అంటేనే ఓ గజిబిజి. అటువంటి సెంటర్‌లో టూ వీలర్‌ మీద వెళ్తున్న మహిళకు యాక్సిడెంట్ అయింది. అంతే..అక్కడున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎత్తుకుని ఆటోలో కూర్చోపెట్టాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందేలా చేశాడు. దీంతో..పోలీసులకే కాకుండా ప్రజలు కానిస్టేబుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story
Share it