కర్నూలు జిల్లాలోని చాగలమర్రి - పాణ‌్యం వద్ద భారీ చోరీ జరిగింది. ఓ కొరియర్ కంపెనీకి చెందిన పలు వాహనాలను దోపిడీ దొంగల ముఠా సభ్యులు దోచుకున్నారు. దాదాపు రూ.25 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను ఈ ముఠా దొంగిలించింది. అనంతరం ఆ ఖాళీ కొరియర్ బాక్సులను పాణ్యం వద్ద పడేసినట్లు సమాచారం. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చశారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.